Home
Tollywood News
Tollywood News News
-
Victory Venkatesh: క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
Victory Venkatesh: కాలేజ్ లైఫ్ అంటే కేవలం క్లాస్ రూముల్లో కూర్చోవడమే కాదు.. క్లాసులు బంక్ కొట్టడంలోనూ ఓ స్పెషాలిటీ ఉందని విక్టరీ వెంకటేష్ సరదాగా వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, తనదైన స్టైల్లో విద్యార్థులతో ముచ్చటిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా వెంకీ మామ మాట్లాడుతూ.. జీవితంలో మళ్లీ రాని అత్యుత్తమ సమయం కాలేజీ రోజులేనని, ఈ నాలుగేళ్ల జీవితాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని చెప్పారు.… -
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
ఈ మధ్య ప్రమోషనల్ కంటెంట్ తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాల్లో జోజో ఒకటి. దేవా కట్టా సమర్పిస్తున్న రూరల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అని చెబుతూనే, మేకర్స్ ‘కాషన్ టూ’ పేరుతో కొత్త గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణ కమల్, మహేష్ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొన్నగిరిలో జరిగే వజ్రాల వేట చుట్టూ… -
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక… -
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు… -
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో బోలెడంత వైబ్రెంట్ ఎనర్జీ, ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఎన్టీవీ ఇంటర్వ్యూలో విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు… -
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
Dheeraj Mogilineni: బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీకి తలొగ్గి చిన్న చిత్రాలు దారి వెతుక్కోవడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఇప్పుడు అదే పరిస్థితుల మధ్య ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 30 తేదీన కాకుండా, నవంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించారు. పెద్ద సినిమాల రద్దీ వల్ల మంచి కంటెంట్‌తో తీసిన సినిమా దెబ్బతినకూడదనే… -
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్‌తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్… -
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
సాధారణంగా తమ సినిమాపై నమ్మకంతో దర్శకులు స్టేజ్ మీద రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. కాలరెగరేయడం, తొడగొట్టడం, సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వదిలేస్తాం అనడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ, ‘కిల్లర్’ సినిమా దర్శకుడు, హీరోయిన్ జ్యోతి భర్త సుకు పూర్వాజ్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ సెన్సేషనల్ ఛాలెంజ్ విసిరారు. కిల్లర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలోని స్క్రీన్ స్పేస్, స్పీడ్… -
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
తెలుగు తెరపై హీరోలంటే కేవలం స్టైల్, మాస్ ఇమేజ్, లుక్స్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒకే పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే.. ఆ పెర్ఫార్మెన్స్కు దక్కే గుర్తింపే వేరు. ఇప్పుడు టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అద్భుతమైన ప్రయోగంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ‘సత్తిబాబు’ పాత్రలో ఆయన చేస్తున్న మేకోవర్, చూపిస్తున్న నటనా వైవిధ్యం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్… -
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
“క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది..” ఈ ఒక్క పవర్ఫుల్ డైలాగ్ చాలు, రాబోయే క్రైమ్ థ్రిల్లర్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పడానికి. ఒక ఊరు.. ఆ ఊరిలో అనూహ్యంగా దొరికిన ఓ తల లేని మృతదేహం.. ఆ వెంటనే మరో వ్యక్తి అదృశ్యం! వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ వరుస సంఘటనల వెనుక ఉన్న ఆ చీకటి కోణం ఏంటి? ఈ రక్తపాత…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!