1. చిరంజీవి, నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరాలో భార్యాభరల్లా నటించిన చిరంజీవి, నయన ‘మన శంకరవరప్రసాద్’లో విడిపోయిన భార్యాభర్తల్లా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్‌ఫాదర్‌లో అన్నాచెల్లెల్లుగా నటించారు. ఈ ఇద్దరి కాంబోలో సరైన హిట్ లేకపోయినా ఈ సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి పట్టించుకోలేదు. 2. బాలకృష్ణ, నయనతారది సూపర్‌హిట్ పెయిర్ కావడంతో నాలుగోసారి కలిసి నటిస్తున్నారు. సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా హిట్స్‌తర్వాత నయన మరోసారి బాలయ్యతో జత కడుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందే…