అంజలి అచ్చ తెలుగు అమ్మాయే, కానీ రచ్చ గెలిచి ఇచ్ఛతో ఇంటికొచ్చి మెప్పించింది. నటిగా అంజలికి రావలసినంత గుర్తింపు రాలేదని తెలుగు అభిమానుల ఆవేదన. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకుంటోంది అంజలి. టాప్ స్టార్స్ సరసన సైతం నటించి అలరించిన అంజలి విలక్షణమైన పాత్రల్లోనూ సలక్షణంగా అభినయిస్తూ సాగుతోంది. అంజలి 1988 జూన్ 16న తూర్పు గోదావరి జిల్లా రాజోల్ లో జన్మించింది. స్వస్థలంలోనే…