ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. టాలీవుడ్‌ను పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ నేరుగా కాకుండా ఒక పక్కా ప్రణాళికతో సాగనుంది. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కీలక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది.…