ఒకటికాదు రెండు కాదు ఏకంగా డజన్లు డజన్లు ప్లాప్ లు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషకాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సిసినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లు అవుతుందో వాళ్ళు కూడా మరిచిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ప్లాప్స్ తో దూసుకెళ్తూ …
తెలుగు సినిమా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అడపాదడపా సూపర్ హిట్టవుతున్న సినిమాలను హైలైట్ చేస్తూ.. అట్టర్ ఫ్లాప్ అవుతున్న మెజార్టీ సినిమాల గురించి ఎవరూ ఆలోచించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చాన్నాళ్లుగా నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయారు. ఇక అదుపు తప్పుతున్న నిర్మాణవ్యయం, అధిక రెమ్యూనరేషన్లతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టైంది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఓవర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న టాలీవుడ్.. చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయాలున్నాయి.…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకు సంబంధించిన కీలక నిర్ణయం జూన్ 1, 2025 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా, తాజా చర్చల తర్వాత ఈ నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మే 21, 2025న హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలు ఈ విషయంలో కీలక పరిణామంగా నిలిచాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య జరిగిన వాడివేడి చర్చలు పరిశ్రమలో సామరస్యాన్ని కాపాడే దిశగా ఒక అడుగు ముందుకు వేశాయి. మే…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి…