గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని సమస్యలపై, టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో మీట్ అవ్వడం, సమస్యల గురించి చర్చించడం చూస్తూనే ఉన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఎప్పుడు భేటీ అవుతారు ? అనే విషయంపై మాత్రం స్పష్టత లేకపోయింది.…