‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. 2019లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని ఓ చిన్న ఫన్నీ వీడియో ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!వస్తే, కొద్దిగా ముందుగా. వెళ్ళినా కొద్దిగా వెనకగా!…