భారతదేశానికి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావడం పట్ల మన తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పతకం గెలిచి దేశ ప్రతిష్టను పెంచిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను…