రాష్ట్ర విద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,104 పాఠశాలల్లో 3 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీ…