ఆస్తులు అమ్ముతున్న రెడ్డీస్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నెదర్లాండ్స్‌లోని కొన్ని ఆస్తులను మరియు అప్పులను విక్రయించబోతోంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన డెల్‌ఫార్మా గ్రూపుతో ఒపందం చేసుకుంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌లో డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బీవీ పేరుతో అనుబంధ సంస్థ ఉంది. దీనికి సంబంధించిన ఆస్తులను, రుణాలను అమ్మటంతోపాటు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.
Business Today: ‘సన్ ఫ్లవర్’ దిగుమతి.. హైదరాబాద్ సంస్థ రికార్డ్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో పొద్దుతిరుగుడు పువ్వు ముడి వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకున్న సంస్థగా హైదరాబాద్‌కి చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయంలో వరుసగా రెండోసారీ ఫస్ట్ ప్లేసులో నిలిచి అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి వెల్లడించారు.
Akasa Air Pilot’s Salaries: మన దేశ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్ సంస్థ.. పైలట్ల శాలరీలను భారీగా పెంచటంలో ముందంజలో నిలుస్తోంది. తాజాగా సగటున 60 శాతం హైక్ చేసింది. వైమానిక సేవలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 2 లక్షల 79 వేలు మాత్రమే ఉన్న కెప్టెన్ల స్టార్టింగ్ శాలరీ నాలుగున్నర లక్షలకు చేరింది. ఫస్ట్ ఆఫీసర్ల వేతనం లక్షా 11 వేల నుంచి…