Heavy Rains In Tirupati: టెంపుల్ సిటీ తిరుపతిలో గత ఐదు గంటలుగా భారీగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వానకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక, తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో సచివాలయంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుతం వాయుగుండం తమిళనాడులో తీరం దాటిందని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు,…