ఇదిలా ఉంటే అయోధ్యలోని రామాలయ మహా సంప్రోక్షణలో పాల్గొనే అతిథులు, భక్తులందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి అందించే ప్రసిద్ధ ప్రసాదమైన 'శ్రీవారి లడ్డూ'ను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష తిరుపతి లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.