Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి…
Tirumala Brahmotsavam Celebrations: తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకంతంగానే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నాలుగు మాఢవీధుల్లో ఘనంగా నిర్వహించాలని టీటీడీ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే తమిళులకు ఎంతో ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో…