తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడోత్సవం నేత్ర పర్వంగా మొదలైంది. వైభవంగా శ్రీవారికి గరుడవాహన సేవ మొదలుకాగా.. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.