TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI)ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో ఔట్‌సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన…