కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. ప్రస్తుతం వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు.. ఇక, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో శ్రీవారి దర్శనానికి నోచుకోని భక్తులు ఇప్పుడు క్రమంగా తిరుమలకు వెళ్తున్నారు.. నవంబర్ నెల ముగుస్తుండడంతో.. డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది టీటీడీ.. Read Also: ఏపీ వరి ధాన్యానికి బ్రేక్‌లు..! సరిహద్దులో అడ్డుకున్న తెలంగాణ అధికారులు..…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… రేపటి నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ…