అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. తమను ఎవరేం చేయలేరన్న అహంకారంతో రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ఘటన! సహాయం చేసిన వ్యక్తినే ఓ ఎస్సై విచక్షణారహితంగా కొట్టాడు. ఆ వ్యక్తి తప్పేం లేదు. ఒక సమస్యని పరిష్కరించి, కాస్త ఆలస్యంగా వచ్చాడంతే! దీంతో ఆలస్యంగా వస్తావా అంటూ.. ఆ వ్యక్తిపై ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి చౌటకూర్ మండలం శివ్యంపేటలో…