తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని అన్నారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్‌లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు.
పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు.
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోనియా, ఖర్గే ఎంపిక చేశారని.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
KTR: ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎంపిక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతలకే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.