చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ టీనా సాధు మృత్యువాత పడింది. ఓంకార్ మొదలుపెట్టిన డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా ఈరోజు ఉదయం మృతి చెందినట్లు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తెలిపారు. అయితే ఆమె ఎలా మృతి చెందింది అనేది తెలియలేదు. ” ఆట సీజన్‌లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు…