Shocking Survey: కేంద్రం విడుదల చేసిన టైమ్ యూజ్ సర్వే 2024లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సర్వేలో తేలింది. స్వీయ సంరక్షణ, నిర్వహణపై తక్కువ సమయం గడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ సర్వే ప్రకారం.. రోజులో ఉపాధి, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పురుషులు, మహిళలు(15-59 సంవత్సరాలు) పాల్గొనడటం 75 శాతం, 25 శాతానికి పెరిగింది. ఇది 2019లో 70.9 శాతం, 21.8 శాతంగా ఉండేది.