ఎప్పుడూ రాజకీయాలు.. ఎన్నికలు.. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలే కాదు కాస్త ఆటలు కూడా ఆడాలంటున్నారు మంత్రి హరీష్ రావు. పైగా ఆయనిప్పుడు వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా ఫిట్ గా వుండడానికి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. గతంలోనూ ఆటవిడుపుగా క్రికెట్ ఆడిన సందర్భాలున్నాయి. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను గాడిన పెట్టే పనిలో బిజీగా వున్న హరీష్ రావు క్రికెట్ ఆడడం ద్వారా సరదాగా గడిపారు.