Tihar Jail: గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో హత్య చేసిన కొన్ని రోజులకు కీలక పరిణామం సంభవించింది. 90 మందికి పైగా తీహార్ జైలు అధికారులను గురువారం ఉన్నతాధికారులు ట్రాన్స్పర్ చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు సహా 99 మంది అధికారులను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సంజయ్ బెనివాల్ ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.