TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను ఫోటోగ్రఫీ ద్వారా వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో పులుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది.