టికెట్ ధరలు పెరిగిపోయాయని బాధపడుతున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. తాజాగా థియేటర్లలో సినిమా టికెట్ ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించిన వెంటనే, టాలీవుడ్ నిర్మాతలు ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ జీవో విడుదలైన కొద్ది రోజులకే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి భారీ చిత్రాలు వాయిదా…
గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ ధరల విషయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్జీవీ ధైర్యం చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రికి, ఆర్జీవికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించే చర్చ నడుస్తోంది. తాజా ట్వీట్ లో ఆర్జీవీ మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ? అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. Read Also : బ్రేకింగ్ : “రాధేశ్యామ్”…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున ఆర్జీవీ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలతో ముంచెత్తుతుంటే, నాని కూడా తగ్గేదే లే అన్నట్టుగా సమాధానాలతో పాటు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ట్విట్టర్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని వంటి కొంతమంది హీరోలు…
సినిమా టిక్కెట్ల విషయమై వివాదం రానురానూ మరింత ముదురుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఈ కాంట్రవర్సీలోకి ఎంటర్ అవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా మేకింగ్, బిజినెస్, హీరోల రెమ్యూనరేషన్ తదితర అంశాలకు సంబంధించి ఆయన సంధించిన పది లాజికల్ ప్రశ్నలు సంధించడం సంచలనం రేపింది. అయితే ఆయన ప్రశ్నలకు కౌంటర్ వేస్తూ పేర్ని…
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి…
ఏపీలో ఒక వైపు టికెట్ల రేట్ల పై రచ్చ కొనసాగుతోంది. సినిమా వర్సెస్ రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ కామెంట్స్ చేయడంతో మరోమారు ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదన్నారు అంబికా కృష్ణ. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, ధియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు…
తిరుమలలో పరిణామాలపై మండిపడ్డారు గోవిందానంద సరస్వతీ స్వామీజీ. కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుగా వున్న గోవిందానంద సరస్వతీ స్వామీజీ టీటీడీ వ్యాపార ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు. శ్రీవారిని రోడ్డుమీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..? శ్రీవారి సేవలు వెల కట్టలేనిది. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదు. స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనేవిధంగా టీటీడీ…
కరోనా కారణంగా థియేటర్లపై ఆంక్షలువ విధిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీని పరిశ్రమకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తెలిపారు.ఇప్పటికే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీని పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలిపారు. సినిమా పరిశ్రమను నమ్ముకుని ఎందరో ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. వారి ఉపాధిపైన దెబ్బకొట్టలేమని మంత్రి వెల్లడించారు. మొదటి…
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ప్రదర్శన, టిక్కెట్ రేట్ల పై నియంత్రణ పెట్టడాన్ని ఖండించారు. నాలుగున్నర దశాబ్దాలుగా దర్శకుడిగా, నిర్మాతగా ఈ రంగంలో ఉన్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, పంపిణీదారులు, నిర్మాతలు వీరంతా బాగుంటేనే చిత్రసీమ బాగుంటుందని అన్నారు. టిక్కెట్ రేట్లు తగ్గించడం, షోస్ ను ప్రభుత్వం నిర్ణయించడం వల్ల చాలామంది తీవ్ర నష్టాలకు గురి అవుతారని రాఘవేంద్రరావు అభిప్రాయ పడ్డారు. కామన్ మ్యాన్ కు సినిమా ఒక్కటే వినోద సాధనమని…