‘డిగ్నిటీ’ అంటూ పేర్ని నానికి ఆర్జీవీ సమాధానం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున ఆర్జీవీ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలతో ముంచెత్తుతుంటే, నాని కూడా తగ్గేదే లే అన్నట్టుగా సమాధానాలతో పాటు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ట్విట్టర్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని వంటి కొంతమంది హీరోలు ఈ విషయంపై ఫైర్ అయ్యారు. అయితే ఆర్జీవీ తెరపైకి వచ్చాక ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి ఆర్జీవీ వర్సెస్ పేర్ని నానిగా మారింది. ఇక ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు ఇప్పటికైనా నోరు విప్పుతారనే ఆశాభావాన్ని ఆర్జీవీ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘డిగ్నిటీ’ అంటూ పేర్ని నాని వేసిన ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానం ఇవ్వడం వైరల్ అవుతోంది. అసలు పేర్ని నాని ఏం అన్నారు ? దానికి ఆర్జీవీ ఎలా స్పందించారో వాళ్ళ ట్వీట్స్ లోనే చూద్దాం.
Read Also : జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు
Also Read
థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది https://t.co/vNmYLAXmty
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి .. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు
తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం https://t.co/vNmYLAXmty— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు
ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు?
క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు. https://t.co/vNmYLAXmty— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం ..ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం.
బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది? https://t.co/vNmYLAXmty— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి
వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై https://t.co/vNmYLAXmty— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్య0 గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ? https://t.co/vNmYLAXmty
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
సారీ నాని గారు లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు …అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు …ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది https://t.co/t3hBzQNGov
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా.మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. https://t.co/JQWp7NIxWm
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి https://t.co/JQWp7NIxWm
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు https://t.co/ztXFxqvVGd
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే https://t.co/ztXFxqvVGd
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
రేట్ లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని ఎందుకంటే సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నాము అని చెప్పింది మీ నాయకులే.. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు? https://t.co/UyKtV1bFMg
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
100% కరెక్ట్.అలాంటప్పుడు V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు?ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే..
వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు, వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు https://t.co/veUwcWUeRk— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? https://t.co/Zziw7n85Nv
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దానికోసం పెదాల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదు..అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది. https://t.co/DzN8BLMcsK
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
చివరిగా @perni_nani గారు మీ పార్టీ లో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీ తో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
My answers to the A P government’s honourable cinematography minister @perni_nani gaarus questions https://t.co/xwPXvOiuQ4
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?