Weather Updates: తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశముందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,…