ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నిజాం సాగర్ కాల్వలో పడి గల్లంతైన ఘటనలు చందూరుతో పాటు వర్ని మండలం అఫందీఫారంలో శనివారం చోటుచేసుకుంది. వర్ని, చందూర్ మండలాల్లోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయినట్లు వర్ని ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడించారు.