అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె…
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
మహారాష్ట్రలోని ముంబైలో పెను ప్రమాదం జరిగింది. మలాద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. ఈస్ట్ మలాడ్‌లోని గోవింద్ నగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:10 గంటలకు ఈ ఘటన జరిగింది.
Plane Crash : అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా ముగ్గురు చనిపోయారు. మీడియా కథనాల ప్రకారం అది చిన్న విమానం. అందులో ఎక్కువ మంది లేరు.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి…