సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోషకుమార్, పరశురామ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఒక్కొక్కరు రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ…