2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాతో ‘తిరువీర్’ వెండి తెరకు పరిచయమయ్యారు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు సినిమాల్లో నటించినా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలతో నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డారు. సిన్ వెబ్ సిరీస్, టక్ జగదీష్ సినిమాలో తన నటనను నిరూపించుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోగా…
Masooda Fame Thiruveer married Kalpana Rao: టాలీవుడ్ యువ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 21) తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువీర్, కల్పనా వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు…