ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్ ఆద్వర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన మూడు పార్టీలైన టీడీపి, వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకావడం లేదని సమాచారం. మోడినీ, బీజేపీని ప్రధానంగా ఎదుర్కొనడానికి బలమైన ఫ్రంట్ అవసరం కావడంతో విపక్షాలు ఈ సమావేశాన్ని…