కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తుంటే తప్పనిసరిగా మూడో వేవ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ కూడా తీసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా.. మూడో డోస్ తీసుకున్న వారిని ఇతరులతో పోల్చి చూస్తే…