విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక దశ ప్రారంభమైంది. 100శాతం ఉత్పత్తి లక్ష్యంగా మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ పునఃరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మరోవైపు, 11వేల కోట్ల ఆర్ధిక సహాయం కేంద్రం ప్రకటించిన తర్వాత RINLలో కీలక మార్పులు సంభవించాయి. సంస్కరణలు అమలు చేస్తున్న యాజమాన్యం తాజాగా రెండు కీలక విభాగాలను ప్రయివేటీకరించేందుకు నిర్ణయించింది.