గత నెల (జూన్) 20 నుండి తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని చెప్పేశారు. అంతే కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది. అయితే… శనివారం తమ సమస్యలను…
‘అక్టోబర్ నెలాఖరు వరకూ ఏ నిర్మాత తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసింది. అయితే… దానికంటే ముందే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన బ్యానర్ లో ఇతరులతో కలిసి నిర్మిస్తున్న ‘నారప్ప, దృశ్యం -2, విరాట పర్వం’ చిత్రాలను ఓటీటీ రిలీజ్ కు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఛాంబర్ సర్వ సభ్య సమావేశంలోనూ సభ్యులు సురేశ్ బాబును టార్గెట్ చేస్తూ…
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి. అయితే జూలై 9 నుండి సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు తిరిగి తెరవబడతాయని యూపీ సినిమా ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ ఇంతకుముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకున్నారు. Read Also : పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ…
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం…
త్వరలోనే థియేటర్లు తెరచుకొనే సూచనలు కనిపిస్తుండటంతో ఓటీటీ బాట పట్టే సినిమాలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పర్మిషన్ ఉండగా.. ఏపీలోనూ రీసెంట్ గా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా.. ఒకే చేశారనే ప్రచారం కూడా జరిగింది. కాగా, నారప్ప నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన డిస్ట్రిబ్యూటర్ల చర్చలతో.. అతిత్వరలోనే తెర…
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిమితులను పూర్తిగా ఎత్తేశాయి ప్రభుత్వాలు. ఇక లాక్డౌన్ కారణంగా విడుదలలు వాయిదా వేసుకున్న ఎన్నో చిత్రాల నిర్మాతలు థియేటర్ల రీఓపెన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తిరిగి ఓపెన్ అయితే విడుదలవ్వడానికి పలు భారీ సినిమాలు కాచుకుని కూర్చున్నాయి. Read…
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని…
కరోనా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకు విముక్తి లభించిన.. సినిమా థియేటర్లు మాత్రం కాస్త ఓపికపడుతున్నాయి. బడా సినిమాల విడుదల కోసం థియేటర్ల యాజమాన్యాలు వేచిచూస్తున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో మరిన్ని సినిమాలు అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కినేని అఖిల్ నటిస్తున్న…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా…