ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా,…