బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ ప్రైవేట్ పార్ట్‌ను నర్సు కోసేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్‌లోని ఆర్‌బిఎస్ హెల్త్ కేర్‌లో జరిగింది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సంజు తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మొదట…