హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని లేకుండా ఎందరో నటీనటులు తమకు తెలిసిన అంశాలపైనో, లేక ట్రావెలింగ్ తోనో, కాకపోతే తమ ఆత్మకథలనో పుస్తకరూపంలో జనం ముందుంచారు. ఇవన్నీ నాన్ ఫిక్షన్ గానే పరిగణించారు. కానీ, ఓ నటుడు అందునా రెండు సార్లు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను అందుకున్న టామ్ హ్యాంక్స్ లాంటివారు ‘ఫిక్షన్’తో ఓ నవలను రాయడం నిజంగా విశేషమే!పైగా తాను చుట్టూ చూసిన ‘రంగుల ప్రపంచం’ ఆధారంగానే ఈ నవలను రచించడం…