Chillapalli-The Vintage Weavers: మగువలకు చీరలంటే మక్కువ. అది తెలుగువారికి మరింత ఎక్కువ. ఎందుకంటే శారీస్ లేడీస్ చక్కదనాన్ని పెంచుతాయి. వాళ్లకు నిండుదనాన్ని నింపుతాయి. అమ్మతనాన్ని అద్దుతాయి. మహిళల జీవితంలోని మధురమైన ఘట్టాలన్నీ చీరలతో ‘‘ముడి’’పడి ఉన్నాయి. మనువు ముహూర్తం మొదలుకొని.. ముత్తైదువుతనం వరకు, నిశ్చితార్థం నుంచి శ్రీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ వాళ్ల సంతోషానికి చీరలు అద్దంపడతాయి. ఇలా చెప్పుకుంటూపోతే చీరలోని గొప్పతనం