లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారని.. అదే సభలో పేదల గురించి మాట్లాడితే మాత్రం విసుగ్గా చూస్తారంటూ విమర్శలు గుప్పించారు.
ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.