Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈనెల 17న తన రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లకు థాలీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.8.5 లక్షల నగదు అందజేస్తానని తెలిపాడు. అయితే కొన్ని షరతులు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్‌లో మోదీ బర్త్ డేను పురస్కరించుకుని…