పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 10వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణు వర్థన్, శైలేష్ ఆర్ సింగ్ తెలిపారు. జయలలితగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ లభించింది. గత యేడాది జూన్ 26న ఈ సినిమా విడుదల…