థాయ్‌లాండ్‌లో ఓ యువతి విసిరిన వలపు వల ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. ఏకంగా బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసింది ఆ యువతి. అంతే కాదు మూడేళ్ల నుంచి వారి వద్ద నుంచి రూ. 102 కోట్లు కొల్లగొట్టింది. 2024లో ఈ యువతి హనీ ట్రాప్ షురూ చేసింది. ఓ సన్యాసితో సంబంధం ఏర్పరచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
S*ex Scandal: థాయ్‌లాండ్ బుద్ధిజాన్ని అనుసరించే ఒక దేశం, ఆ దేశంలో బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం ఉంటుంది. రాజకీయంగా, సామాజికంగా వీరి ప్రభావం ఎక్కువ. అయితే, ఇప్పుడు వారి ప్రతిష్ట మసకబారేలా కొందరు బౌద్ధ సన్యాసులు ప్రవర్తించడం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. లైంగిక దోపిడీ కుంభకోణం బౌద్ధమాధికారుల గౌరవాన్ని దిగజార్చింది. వారి భక్తుల, వారిని విశ్వాసించే వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.