అధికారంలోకి వస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కానీ.. చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట.