ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 11,063 ఉపాధ్యాయ పోస్టుల జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) రిక్రూట్‌మెంట్ తుది జాబితాను నేటి (అక్టోబర్ 7, సోమవారం) సాయంత్రంలోపు విడుదల చేయనుంది. ఎంపికైన ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ జాయినింగ్ ఆర్డర్‌లను స్వీకరించేందుకు అక్టోబర్ 9వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు ఎల్‌బి స్టేడియానికి చేరుకోవాలని అభ్యర్థించడం జరిగింది. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ..…
అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది.