Fire Breaks Out: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న దివాన్‌దేవిడి ప్రాంతంలోని మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటాక ఉదయం 2:15 గంటలకు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మదీనా సర్కిల్ వద్ద…