బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ రికార్డులు బ్రేక్ కాగా.. ఇంకొన్ని రికార్డులు అలానే ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ఈ ట్రోఫీని భారత్ చేజిక్కించుకుంటుండటంతో.. ఆస్ట్రేలియా మాత్రం పోరాడుతూనే ఉంది. మరోవైపు.. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాలో కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.