గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఓ పెద్ద ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసింది. భారత ఉపఖండంలోని అల్ ఖైదా (AQIS)తో సంబంధం ఉన్న మాడ్యూల్‌ను ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ అధికారుల ప్రకారం.. పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు గుజరాత్, ఒకరు ఢిల్లీ, మరొకరు నోయిడా (ఉత్తరప్రదేశ్)కు చెందిన వారిగా గుర్తించారు.