పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ.. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది.. భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. మరోవైపు, భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది విజయం మనదే అంటూ.. ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్)…
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.
భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్‌క్వార్టర్ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.
Operation Sindoor : పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. భార్యల కళ్లెదుటే భర్తలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. అయితే, ఇప్పుడు ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. భారత సైన్యం పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మెరుపు…