ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో చార్‌థామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు.
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై ఆందోళన కారులు రాళ్ళు రువ్వి.. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఆర్దీసీ బస్సులను సైతం నిరసన కారులు ధ్వంసం చేశారు.