Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోనేరు వద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల శీలం శ్రీనివాస్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని అరెస్టు వివరాలు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఎస్పీ వివరాల ప్రకారం.. ఇంటివద్ద పంట కాలువ స్థలం విషయంలో ఆలయ పూజారితో నిందితుడికి వివాదం తలెత్తింది.